అమెరికా నేతలపై చైనా ఆంక్షలు...
ABN , First Publish Date - 2020-08-11T21:52:32+05:30 IST
హాంకాంగ్ విషయాల్లో అమెరికా రాజకీయ నేతలు అత్యుత్సాహాన్ని, మితిమిరీన జోక్యాన్ని ప్రదర్శిస్తున్నారని చైనా మండిపడింది.

బీజింగ్ : హాంకాంగ్ విషయాల్లో అమెరికా రాజకీయ నేతలు అత్యుత్సాహాన్ని, మితిమిరీన జోక్యాన్ని ప్రదర్శిస్తున్నారని చైనా మండిపడింది.
ఈ విషయంలో పదేపదే అవాంఛనీయ వ్యాఖ్యలు చేస్తున్నారన్న భావనతో... అమెరికాకు చెందిన పదకొండు మంది రాజకీయ నేతలు, వివిధ సంస్థల అధినేతలపై చైనా ఆంక్షలు విధించింది.
అయితే ఆ ఆంక్షలు ఏమిటన్నవి వెల్లడించలేదు. సెనేటర్లు... మాక్రో రుబియో, టెడ్ క్రుజ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. హాంకాంగ్ విషయంలో ఈ పదకొండు మంది బాధ్యతారహితంగా ప్రవర్తించారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియోన్ విమర్ర్శించారు.
రుబియో, క్రుజ్‍లతో పాటు సెనేటర్లు జోష్ హాలే, టామ్ కాటన్, క్రిస్ స్మిత్, నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ, ఫ్రీడమ్ హౌస్ సంస్థల అధినేతల పేర్లు ఉన్నాయి. రుబియో, క్రుజ్, స్మిత్‍లపై గత నెలలోనే ప్రయాణ నిషేధం విధించిన విషయం తెలిసిందే.