చైనాలో మళ్లీ కరోనా కలకలం.. అయితే ట్విస్ట్ ఏంటంటే...
ABN , First Publish Date - 2020-05-24T16:08:42+05:30 IST
చైనాలో కరోనా హాట్‌స్పాట్‌గా పేరొందిన వుహాన్‌లో కరోనా ప్రభావం మళ్లీ మొదలైంది. కొత్తగా వుహాన్‌లో...

చైనాలో కరోనా హాట్‌స్పాట్‌గా పేరొందిన వుహాన్‌లో కరోనా ప్రభావం మళ్లీ మొదలైంది. కొత్తగా చైనాలో 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్‌గా తేలిన ఈ 39 మందిలో 36 మందికి అసలు లక్షణాలే లేవని తెలిసింది. ఈ 39 కరోనా పాజిటివ్ కేసుల్లో ఎక్కువ కేసులు హుబేయి ప్రావిన్స్‌లో నమోదయినట్లు అధికారులు తెలిపారు. కరోనా ప్రభావం తగ్గడంతో వుహాన్‌లో ఏప్రిల్ 8 నుంచి లాక్‌డౌన్ ఎత్తేశారు. మళ్లీ కొత్తగా కేసులు పెరుగుతుండటం అక్కడి వారిలో ఆందోళన రేపుతోంది.