మసీదు గుమ్మటాలను తొలగించిన చైనా

ABN , First Publish Date - 2020-11-03T21:43:41+05:30 IST

చైనాలోని సుప్రసిద్ధ నాన్‌గువాన్ మసీదు తన రూపాన్ని కోల్పోయింది. నింగ్జియా ప్రావిన్సులో ఇస్లాం పద్ధతిలో కట్టిన ఈ మసీదు పర్యాటక ప్రాంతం కూడా.

మసీదు గుమ్మటాలను తొలగించిన చైనా

ఇంటర్నెట్ డెస్క్: చైనాలోని సుప్రసిద్ధ నాన్‌గువాన్ మసీదు తన రూపాన్ని కోల్పోయింది. నింగ్జియా ప్రావిన్సులో ఇస్లాం పద్ధతిలో కట్టిన ఈ మసీదు పర్యాటక ప్రాంతం కూడా. పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించే ఈ మసీదు రూపరేఖలను మార్చేసింది అక్కడి ప్రభుత్వం. చైనాలోని బ్రిటన్ హైకమిషనర్ క్రిస్టీనా స్కాట్ చేసిన ట్వీట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పెద్ద పెద్ద గుమ్మటాలతో, బంగారపు వర్ణంలో తళతళ మెరిసే స్తంభాలతో ఉండే చాలా మసీదు.. సాధాసీదాగా ఉండటంతో ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్నే తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘గుమ్మటాలు, స్తంభాలు అన్నీ పోయాయి. సందర్శకులను ఎవరినీ అనుమతించడం లేదు’ అని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  




అయితే.. చైనాలో ఇస్లామిక్ నిర్మాణాల రూపురేఖలను మార్చడం ఇదే తొలిసారి కాదని టెలిగ్రాఫ్ తన కథనంలో తెలిపింది. గన్సు ప్రావిన్సులో లెక్కలేనన్ని మసీదుల రూపులు మారిపోయాయని పేర్కొంది. ఇది మత స్వేచ్ఛను హరించడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. చైనాలో ముస్లింల స్వేచ్ఛకు భంగంకలుగుతోందని, వారిని అణచివేస్తున్నారంటూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సైతం తెలిపింది. చైనాలో మానవ హక్కుల హననం జరుగుతోందంటూ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాలు గొంతెత్తుతున్న విషయం తెలిసిందే.    

Updated Date - 2020-11-03T21:43:41+05:30 IST