మూడో వ్యాక్సిన్‌కు చైనా అనుమతి
ABN , First Publish Date - 2020-04-26T07:08:58+05:30 IST
కొవిడ్-19 మూడో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు చైనా అనుమతించింది. ప్రస్తుతం ఈ వాక్సిన్ రెండో దశలో ఉంది. చైనా అనుమతించిన మూడింటిలో ఒకటి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్‌ఏ) క్లినికల్ ట్రయల్స్ విభాగానికి...

బీజింగ్, ఏప్రిల్ 25: కొవిడ్-19 మూడో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు చైనా అనుమతించింది. ప్రస్తుతం ఈ వాక్సిన్ రెండో దశలో ఉంది. చైనా అనుమతించిన మూడింటిలో ఒకటి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్‌ఏ) క్లినికల్ ట్రయల్స్ విభాగానికి చెందినది. ఇది కాకుండా వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్ ప్రొడక్ట్స్, వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంస్థలు ఈ వ్యాక్సిన్ల అభివృద్ధిలో నిమగ్నమై ఉన్నట్లు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయాలజీ(డబ్ల్యూఐవి) చైతన్య రహిత వ్యాక్సిన్‌ను తయారు చేసింది. దీనిలో వైరస్ కణాలు, బ్యాక్టీరియా, ప్రయోగశాలలో కల్చర్ పద్ధతిలో అభివృద్ధి చేసిన ప్యాథోజెన్స్ ఉంటాయి.
ఈ ప్యాథోజెన్స్ వ్యాధికారక శక్తిని కోల్పోయి ఉంటాయి. దీనికి విరుద్ధంగా చైతన్యవంతమైన వ్యాక్సిన్‌లో బతికున్న ప్యాథోజెన్స్‌ను ఉపయోగిస్తారు. అమెరికా అధ్యక్షుడు సహా ఇతర కొన్ని దేశాలు కరోనా వైరస్ ‘వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ నుంచే లీకైందని చేస్తున్న ఆరోపణలను డబ్ల్యూవిఐ అధికారులు ఈ సందర్భంగా ఖండిచారు. ఈ క్లినికల్ ట్రయల్స్ మొదటి దశలో భాగంగా ఏప్రిల్ 23 నాటికి మూడు రకాల వయసున్న 96 మందిపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించారు. ఈ వ్యాక్సిన్ అశాజనకమైన ప్రభావాన్ని చూపించిందని, వ్యాక్సిన్ వేసుకున్న వారందరూ ఆరోగ్యంగా ఉన్నారని, వారిని మరికొద్ది కాలం పరిశీలనలో ఉంచినట్లు చైనా ఫార్మాస్యూటికల్ కంపెనీ సినోఫార్మ్ పేర్కొంది. ఈ చైతన్య రహిత వ్యాక్సిన్‌కు సెంట్రల్ చైనాలోని హెనెన్ ప్రావిన్స్‌లో ర్యాండమ్, డబుల్ బ్లైండ్, ప్లేస్‌బో నియంత్రిత విధానంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు సినోఫార్మ్ తెలిపింది. రెండో దశలో భాగంగా వ్యాక్సినేషన్ పద్ధతిపై దృష్టికేంద్రీకరిస్తామన్నది. ఈ వ్యాక్సిన్‌ను మూడో దశలో కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు, ప్రయోగాలన్నీ పూర్తయి వ్యాక్సిన్ భద్రత, సామర్థ్యత మీద అవగాహనకు రావడానికి ఏడాది సమయం పడుతుంది.