చైనా ఉపగ్రహ ప్రయోగం విఫలం!

ABN , First Publish Date - 2020-09-13T14:34:20+05:30 IST

చైనా ప్రయోగించిన ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరుకోలేకపోయిందని చైనా జాతీయ మీడియా పేర్కొంది.

చైనా ఉపగ్రహ ప్రయోగం విఫలం!

బీజింగ్: చైనా చేపట్టిన ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరుకోలేకపోయిందని చైనా జాతీయ మీడియా పేర్కొంది. ఇందుకు గల కారణాలేమిటో ఇంకా తెలియరాలేదు. అయితే..ఉపగ్రహం పనితీరులో లోపాలు బయటపడ్డాయని మాత్రం తెలిసింది. శనివారం నాడు స్థానిక కాల మానం ప్రకారం మధ్యాహ్నం 1.02 గంటలకు శాస్త్రవేత్తలు శాటిలైట్‌ ప్రయోగాన్ని చేపట్టారు. జిక్యువాన్ శాటిలైట్ సెంటర్ ఈ ప్రయోగానికి వేదికైంది. క్వాయ్‌జావ్-1ఏ రాకెట్‌పై ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. కానీ..ఆ కక్ష్యోలకి ఉపగ్రహం చేరుకోలేకపోయింది. ఇందుకు గల కారణాలను గుర్తించేందుకు చైనా శాస్త్రవేత్తలు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2020-09-13T14:34:20+05:30 IST