100 చదరపు కిలోమీటర్ల మేర చైనా ఆక్రమణ !

ABN , First Publish Date - 2020-09-20T07:33:58+05:30 IST

దళాలను వెంటనే ఉపసంహరించాలని భారత్‌ చైనా మధ్య రాజకీయ స్థాయిలో ఒప్పందాలు కుదిరినా క్షేత్రస్థాయిలో పెద్ద మార్పేమీ లేదు. గోగ్రా, హాట్‌స్ర్పింగ్‌, ఫింగర్‌-4 ఏరియాల నుంచి కొంతమందిని వెనక్కి తీసుకున్నప్పటికీ డెస్పాంగ్‌ వద్ద పరిస్థితి అలానే ఉంది. వై జంక్షన్‌గా పేరొందిన డెస్పాంగ్‌ వద్ద ఐదు పోస్టులు...

100 చదరపు కిలోమీటర్ల మేర చైనా ఆక్రమణ !

లద్దాఖ్‌- ఇటానగర్‌, సెప్టెంబరు 19: దళాలను వెంటనే ఉపసంహరించాలని భారత్‌ చైనా మధ్య రాజకీయ స్థాయిలో ఒప్పందాలు కుదిరినా క్షేత్రస్థాయిలో పెద్ద మార్పేమీ లేదు. గోగ్రా, హాట్‌స్ర్పింగ్‌, ఫింగర్‌-4 ఏరియాల నుంచి కొంతమందిని వెనక్కి తీసుకున్నప్పటికీ డెస్పాంగ్‌ వద్ద పరిస్థితి అలానే ఉంది. వై జంక్షన్‌గా పేరొందిన డెస్పాంగ్‌ వద్ద ఐదు పోస్టులు 10, 11, 11ఎ, 12, 13 పాయింట్ల దాకా అంటే సుమారు 100 చదరపు కిలోమీటర్ల మేర భారత దళాలు గస్తీ నిర్వహించలేని పరిస్థితి నెలకొంది.


వై జంక్షన్‌ వద్ద పీఎల్‌ఏ దళాలు తాత్కాలిక స్థావరాలు ఏర్పరుచుకుని పెట్రోలింగ్‌ను అడ్డుకుంటున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇక పాంగాంగ్‌ సరస్సు ఉత్తర తీరం వద్ద రెండు వారాలుగా 50 మంది పీఎల్‌ఏ సైనికులు తిష్ఠ వేశారు. ఇక అరుణాచల్‌లో 1962లో తీవ్రస్థాయి యుద్ధం జరిగిన ఆరు ప్రాంతాల్లో భారత్‌ తన బలగాల్ని రెట్టింపు చేసింది. అటు జమ్మూ కశ్మీర్‌ సరిహద్దుల్లో పాక్‌ నుంచి చొరబాట్లను అడ్డుకునేందుకు అదనంగా 3000 మంది జవాన్లతో బలగాల్ని భారత్‌ పంపింది. 

Updated Date - 2020-09-20T07:33:58+05:30 IST