చైనా మోదీని ఎందుకు పొగుడుతోంది? రాహుల్

ABN , First Publish Date - 2020-06-22T23:41:35+05:30 IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. ట్విటర్ వేదికగా మరోసారి మోదీపై సెటైర్లు వేశారు.

చైనా మోదీని ఎందుకు పొగుడుతోంది? రాహుల్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. ట్విటర్ వేదికగా మరోసారి మోదీపై సెటైర్లు వేశారు. 


చైనా మన సైనికులను చంపేసింది. మన భూ భాగాన్ని ఆక్రమించుకుంది. అయినా కూడా ఈ సంక్షోభంలో చైనా ఎందుకు ప్రధాని మోదీని పొగుడుతుందని రాహుల్ ట్వీట్ చేశారు. చైనా మీడియాలో వచ్చిన ఓ పత్రికా కథనాన్ని కూడా రాహుల్ జత చేశారు. 
రాహుల్ ఇటీవలే సరెండర్ మోదీ అంటూ ట్వీట్ చేసి కలకలం రేపారు. అంతేకాదు చైనా విషయంలో మాజీ ప్రధాని మన్మోహన్ చెప్పిన విషయాలను మోదీ ఫాలో అవుతే బాగుంటుందంటూ రాహుల్ సలహా ఇచ్చారు. 
లడక్ గల్వాన్ లోయలో చైనా కుట్రపూరితంగా 20 మంది చైనికులను పొట్టనపెట్టుకోవడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. 

Updated Date - 2020-06-22T23:41:35+05:30 IST