కరోనా పోరులో ఉత్తర కొరియాకు చైనా సాయం

ABN , First Publish Date - 2020-05-09T23:30:52+05:30 IST

కోవిడ్-19పై పోరాటంలో ఉత్తర కొరియాకు సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది. దీనికి సబంధించి చైనా అధికారిక టీవీ చానల్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు చైనా అధ్యక్షుడు ఓ లేఖను పంపినట్లు

కరోనా పోరులో ఉత్తర కొరియాకు చైనా సాయం

బీజింగ్: కోవిడ్-19పై పోరాటంలో ఉత్తర కొరియాకు సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది. దీనికి సబంధించి చైనా అధికారిక టీవీ చానల్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు చైనా అధ్యక్షుడు ఓ లేఖను పంపినట్లు పేర్కొన్నారు. ఉత్తర కొరియాలోని పరిస్థితి, ప్రజల ఆరోగ్యంపై జీ జిన్‌పింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. శ్వాసకోశ అనారోగ్యాన్ని నియంత్రించడానికి చేసిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలను సాధించాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తర కొరియాకు అన్ని విధాల అండగా ఉంటామని, తగినంత సాయం చేస్తామని జీ జిన్‌పింగ్ తెలిపినట్లు చైనా అధికారిక టీవీ పేర్కొంది.

Updated Date - 2020-05-09T23:30:52+05:30 IST