మనపై చైనా సైబర్ వార్...

ABN , First Publish Date - 2020-06-23T22:00:39+05:30 IST

గాల్వన్ లోయలో ఘర్షణ తర్వాత మనపై సైబర్ దాడులు చేయడానికి చైనా హ్యాకర్లు 40 వేల సార్లు యత్నించినట్లు నిపుణులు చెబుతున్నారు. భారత సర్వర్లపై సైబర్‌టాక్‌లతో చైనా హాకర్లు విరుచుకుపడుతున్నారన్నది వారు చెబుతున్న మాటల సారాంశం. భద్రతా సంస్థలతో అనుబంధం ఉన్న డేటా సర్వర్లపై ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఇప్పటివరకు... చైనీస్ హ్యాకర్లు దాదాపు నలభై వేలకు పైగా ప్రయత్నాలు చేశారని సమాచారం.

మనపై చైనా సైబర్ వార్...

న్యూఢిల్లీ / హైదరాబాద్ : గాల్వన్ లోయలో ఘర్షణ తర్వాత మనపై సైబర్ దాడులు చేయడానికి చైనా హ్యాకర్లు 40 వేల సార్లు యత్నించినట్లు నిపుణులు చెబుతున్నారు. భారత సర్వర్లపై సైబర్‌టాక్‌లతో చైనా హాకర్లు విరుచుకుపడుతున్నారన్నది వారు చెబుతున్న మాటల సారాంశం. భద్రతా సంస్థలతో అనుబంధం ఉన్న డేటా సర్వర్లపై ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఇప్పటివరకు... చైనీస్ హ్యాకర్లు దాదాపు నలభై వేలకు పైగా ప్రయత్నాలు చేశారని సమాచారం.


ఈ దాడుల్లో అధిక భాగం చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ నుంచే జరిగినట్లు సమాచారం. సిచువాన్ ప్రాంతం చైనా సైబర్ వార్‌ఫేర్ ప్రధాన కార్యాలయం. అయితే... ఈ దాడులు చైనా ప్రభుత్వం ప్రేరేపించినవా... లేక పూర్తిగా ప్రైవేట్ శక్తుల పనా అనేది నిర్ధారించుకునేందుకు భారత అధికారులు యత్నిస్తున్నారు. ఇండియన్ సైబర్ స్పేస్ పై దాడి చేయడానికి ప్రధానంగా రెండు టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు.


'డిస్ట్రిబ్యూటెడ్ డినైయల్ ఆఫ్ సర్వీస్' ఒకటి. ఇందులో... యుటిలిటీ ప్రైవేట్ వెబ్‌సైట్ లు వేల సంఖ్యలో రిక్వెస్ట్ లను అంగీకరిస్తాయి. అయితే చైనీస్ హ్యాకర్లు వాటి సామర్థ్యాన్ని పది లక్షలకు పెంచుతున్నట్లు సమాచారం. దీంతో... ‘సెటప్ క్రాష్‌’కు పరిస్థితులు దారితీస్తాయి. హ్యాకర్లు ఎంచుకుంటోన్న రెండవ మార్గం... 'ఇంటర్నెట్ ప్రోటోకాల్ హైజాక్'. ఇందులో... హ్యాకర్లు చైనా ద్వారా ఇంటర్‌నెట్ ట్రాఫిక్‌ను తమ నిఘా ప్రయోజనం కోసం మళ్లించుకునే వీలుంటుంది.


\కాగా చైనా కుయుక్తులను తిప్పికొట్టేందుకుగాను భారత నిపుణులు శ్రమిస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన సైబర్ నిపుణుడొకరు వెల్లడించారు. 


Updated Date - 2020-06-23T22:00:39+05:30 IST