హాంగ్‌కాంగ్ హోటల్.. ఇప్పుడు చైనా హెడ్‌క్వార్టర్స్!

ABN , First Publish Date - 2020-07-09T05:07:34+05:30 IST

ఇటీవల హాంగ్‌కాంగ్ భద్రతా చట్టానికి ఆమోదం తెలిపిన చైనా.. దాన్ని అమలు చేయడం ప్రారంభించింది.

హాంగ్‌కాంగ్ హోటల్.. ఇప్పుడు చైనా హెడ్‌క్వార్టర్స్!

హాంగ్‌కాంగ్: ఇటీవల హాంగ్‌కాంగ్ భద్రతా చట్టానికి ఆమోదం తెలిపిన చైనా.. దాన్ని అమలు చేయడం ప్రారంభించింది. దీనిలో భాగంగా హాంగ్‌కాంగ్‌లో ప్రో-డెమోక్రసీ నిరసనకారులు అధికంగా ఉన్న విక్టోరియా పార్క్ సమీపంలో చైనీస్ భద్రతా విభాగం ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పింది. ఈ ప్రాంతంలోని ఓ స్టార్ హోటల్‌ను దీనికోసం ఉపయోగిస్తోంది. కొత్త భద్రతా చట్టం ప్రకారం ఈ ఆఫీసులో ఉండే అధికారులకు చట్టాన్ని అమలు చేసే అధికారాలుంటాయి. భద్రతా చట్టంపై నిరసనలను అణచివేసేందుకే చైనా ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకుల అభిప్రాయం.

Updated Date - 2020-07-09T05:07:34+05:30 IST