ముందస్తు ప్రణాళికతోనే దాడి : శ్రీపాద యశోనాయక్

ABN , First Publish Date - 2020-06-19T21:18:50+05:30 IST

భారత జవాన్లపై చైనా సైన్యం ముందస్తు ప్రకారమే దాడి చేసిందని కేంద్ర రక్షణ శాఖా మంత్రి శ్రీపాద యశోనాయక్ మండిపడ్డారు.

ముందస్తు ప్రణాళికతోనే దాడి : శ్రీపాద యశోనాయక్

న్యూఢిల్లీ : భారత జవాన్లపై చైనా సైన్యం ముందస్తు ప్రకారమే దాడి చేసిందని కేంద్ర రక్షణ శాఖా మంత్రి శ్రీపాద యశోనాయక్ మండిపడ్డారు. వాస్తవ నియంత్రణ రేఖ దాటి ఒక్క అంగుళం కూడా దాటి రావడానికి భారత్ అనుమతించదని తేల్చి చెప్పారు. ‘‘ఎలాంటి కారణం లేకుండానే భారత్‌తో చైనా దూకుడుగా ప్రవర్తిస్తోంది. ఆరేడు పోస్ట్‌లపై ఓ ప్రణాళిక ప్రకారమే దాడి చేసింది. చైనాకు దీటైన జవాబిచ్చి తీరుతాం’’ అని ప్రకటించారు. చైనా సైనికులతో పోరు సలిపి అమరులైన కల్నల్, జవాన్లకు సంతాపాన్ని తెలుపుతున్నానని, దేశం కోసం వారు చేసిన త్యాగాన్ని చూసి దేశం గర్విస్తోందని ఆయన తెలిపారు. వారి త్యాగం ఏమాత్రం వృథా పోదని శ్రీపాద యశోనాయక్ స్పష్టం చేవారు. 

Updated Date - 2020-06-19T21:18:50+05:30 IST