కరోనా వైరస్ దర్యాప్తుకు ఒప్పుకున్న చైనా

ABN , First Publish Date - 2020-05-19T01:53:26+05:30 IST

అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరగడంతో కోవిడ్-19 మూలంపై దర్యాప్తు కోసం చైనా అంగీకరించింది. చైనాలోనే కరోనా వైరస్ పుట్టిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా.. ఈ వాదనలను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది

కరోనా వైరస్ దర్యాప్తుకు ఒప్పుకున్న చైనా

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరగడంతో కోవిడ్-19 మూలంపై దర్యాప్తు కోసం చైనా అంగీకరించింది. తమ వద్దే కరోనా వైరస్ పుట్టిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా.. ఈ వాదనలను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇదే నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సమీక్షకు చైనా అంగీకరించడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసిన ఈ వ్యాధి మొదట బయటపడినప్పుడు చైనా పారదర్శకతతో బాధ్యతతో వ్యవహరించిందని అన్నారు. ప్రతి విషయాన్ని తాము బహిరంగంగానే పంచుకుతున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఆయన నివేదించారు.


దర్యాప్తు కోసం ముందుకు రావాలని యూరోపియన్ యూనియన్ రూపొందించిన తీర్మానంపై 100కి పైగా దేశాల మద్దతు ఇచ్చాయి. దీనిపై జిన్‌పింగ్ స్పందిస్తూ ప్రపంచ స్పందనపై సమగ్ర సమీక్ష కోసం బీజింగ్ మద్దతు ఇచ్చిందని అన్నారు. అయితే ఈ పని ప్రపంచ వ్యాప్తంగా కరోనా సమస్యపై పట్టు సాధించిన అనంతరం ప్రారంభిస్తే బాగుంటుందని అన్నారు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం కాపాడటం అత్యవసరమని ఆయన అన్నారు.

Updated Date - 2020-05-19T01:53:26+05:30 IST