ఒంటరి తండ్రులకు ‘చైల్డ్ కేర్ లీవులు’
ABN , First Publish Date - 2020-10-28T07:14:56+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగులైన ఒంటరి తండ్రులకు కేంద్రం శుభవార్త చెప్పింది. భార్య చనిపోయిన, విడాకులు తీసుకున్న లేదా అవివాహితులుగా మిగిలిపోయిన తండ్రులు.. పిల్లల సంరక్షణ బాధ్యతలు ఒంటరిగా మోస్తుంటే...

న్యూఢిల్లీ, అక్టోబరు 27: ప్రభుత్వ ఉద్యోగులైన ఒంటరి తండ్రులకు కేంద్రం శుభవార్త చెప్పింది. భార్య చనిపోయిన, విడాకులు తీసుకున్న లేదా అవివాహితులుగా మిగిలిపోయిన తండ్రులు.. పిల్లల సంరక్షణ బాధ్యతలు ఒంటరిగా మోస్తుంటే.. ఇకపై కేంద్రం ప్రత్యేకంగా పిల్లల సంరక్షణ సెలవులు ఇవ్వనుంది. ఈ సెలవులకు వేతనం కూడా చెల్లించనుంది. ఈ మేరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం ప్రకటించారు. పిల్లల సంరక్షణ సెలవు తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగి.. ముందస్తు అనుమతితో హెడ్‌క్వార్టర్‌ను కూడా విడిచి వెళ్లవచ్చని, ఎల్‌టీసీ కూడా పొందవచ్చని చెప్పారు. ఈ సెలవు తీసుకున్న తండ్రులకు మొదటి 365 రోజులకు గాను పూర్తి జీతం చెల్లిస్తామని, ఆ తర్వాతి 365 రోజులకు మాత్రం సగం వేతనమే ఇస్తామని వివరించారు.