లాక్‌డౌన్ డొల్లతనం బయటపడింది : చిదంబరం ట్వీట్

ABN , First Publish Date - 2020-03-28T21:28:57+05:30 IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌పై ప్రభుత్వం సరిగ్గా సన్నద్ధత కాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ట్విట్టర్ వేదికగా

లాక్‌డౌన్ డొల్లతనం బయటపడింది : చిదంబరం ట్వీట్

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌పై ప్రభుత్వం సరిగ్గా సన్నద్ధత కాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. పట్టణాల్లో పనులు లేకుండా కూలీలు, ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారని, మార్గమధ్యలో చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రజలు రద్దీగా ఉన్న బస్సుల్లో, కాలినడకన, అష్టకష్టాలూ పడుతూ పల్లెలకు తిరుగు ప్రయాణమవుతున్నారు. లాక్‌డౌన్‌కు ప్రభుత్వం సరైన విధంగా సన్నద్ధం కాలేదనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. లాక్‌డౌన్ డొల్లతనం ఈ ఘటనల ద్వారా బయటపడింది’’ అని చిదంబరం ట్వీట్ చేశారు. నగరాలు మరియు పట్టణాలను విడిచి, గ్రామాలకు తిరిగి వెళ్తున్న వారి విషయంలో ఆయా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయని చిదంబరం ప్రశ్నించారు. 

Updated Date - 2020-03-28T21:28:57+05:30 IST