కర్ణాటకలో చికెన్ ధరలకు రెక్కలు..కిలో 300 రూపాయలు

ABN , First Publish Date - 2020-05-18T12:20:16+05:30 IST

లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి....

కర్ణాటకలో చికెన్ ధరలకు రెక్కలు..కిలో 300 రూపాయలు

హుబ్లీ (కర్ణాటక): లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో  కర్ణాటక రాష్ట్రంలో చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. లాక్‌డౌన్ విధించిన ప్రారంభ దశలో చికెన్ ధరలు గణనీయంగా తగ్గినా, రమజాన్ మాసం కావడంతో చికెన్ డిమాండ్ పెరిగి, పౌల్ట్రీ కొరతతో ధరలు పెరిగాయని చికెన్ విక్రయదారుల సంఘం అధ్యక్షుడు నాగరాజ్ పట్టాన్ చెప్పారు. తాను వంద కోళ్లకు ఆర్డరు ఇస్తే కేవలం 50 కోళ్లనే రైతులు పంపించారని, రమజాన్ మాసంలో డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయని నాగరాజ్ పేర్కొన్నారు.  కిలో రూ.80 ఉన్న చికెన్ ధర ఒక్కసారిగా 300రూపాయలకు పెరిగిందని వినియోగదారుడు రవి చెప్పారు. చికెన్ ధరల పెరుగుదలతో తాను కిలోకు బదులు అరకిలో మాత్రమే కొంటున్నానని రవి పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-18T12:20:16+05:30 IST