ట్రక్కును ఢీకొన్న బస్సు... ఏడుగురు మృతి

ABN , First Publish Date - 2020-09-05T14:51:28+05:30 IST

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటచేసుకుంది. కూలీలతో వెళుతున్న బస్సు చెరీఖడీ దగ్గర ఒక ట్రక్కును...

ట్రక్కును ఢీకొన్న బస్సు... ఏడుగురు మృతి

రాయపూర్: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటచేసుకుంది. కూలీలతో వెళుతున్న బస్సు చెరీఖడీ దగ్గర ఒక ట్రక్కును ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ బస్సు ఒడిశాలోని గంజాం నుంచి గుజరాత్ వెళుతోంది. రాయపూర్ ఎస్ఎస్పీ అజయ్ యాదవ్ మాట్లాడుతూ ఒడిశాలోని గంజాం నుంచి గుజరాత్‌లోని సూరత్ వెళుతున్న బస్సు రాయపూర్‌లో ప్రమాదానికి గురయ్యిందన్నారు.


ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారన్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించామని, అక్కడ వారు చికిత్స పొందుతున్నారని తెలిపారు. మృతులను ఇంకా గుర్తించాల్సివుందన్నారు. ప్రస్తుతం పోలీసులు సంఘటనా స్థలంలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2020-09-05T14:51:28+05:30 IST