పేదలకు ఏప్రిల్, మే నెలల్లో ఉచితంగా బియ్యం

ABN , First Publish Date - 2020-03-25T15:01:03+05:30 IST

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ పేదలకు శుభవార్త ....

పేదలకు ఏప్రిల్, మే నెలల్లో ఉచితంగా బియ్యం

రాయపూర్ (ఛత్తీస్‌ఘడ్): కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ పేదలకు శుభవార్త వెల్లడించారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఏప్రిల్, మే నెలల్లో ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తామని సీఎం ప్రకటించారు. పేద కుటుంబాలకు ఉచితంగా రెండు నెలలపాటు బియ్యాన్ని ఉచితంగా అందించాలని సీఎం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సీఎం ఆదేశంతో అధికారులు అంత్యోదయ, వికలాంగులు, సింగిల్, అన్నపూర్ణ కేటగిరి రేషన్ కార్డులున్న వారికి ఉచితంగా బియ్యం అందిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశంతో 21 రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ఛత్తీస్‌ఘడ్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. 

Read more