ఆట ఆడుతూనే కుప్పకూలిపోయాడు..

ABN , First Publish Date - 2020-10-31T16:16:47+05:30 IST

స్నేహితులతో కలసి ఆడుకుంటున్న యువకుడు హఠాత్తుగా స్పృహ తప్పి కిందపడి మృతి చెందాడు. ఆదంబాక్కం కక్కన్‌నగర్‌కు చెందిన న్యాయవాది అన్బళగన్‌ కుమారుడు రోషన్‌(17) ప్లస్‌వన్‌ చదువుతున్నాడు.

ఆట ఆడుతూనే కుప్పకూలిపోయాడు..

చెన్నై : స్నేహితులతో కలసి ఆడుకుంటున్న యువకుడు హఠాత్తుగా స్పృహ తప్పి కిందపడి మృతి చెందాడు. ఆదంబాక్కం కక్కన్‌నగర్‌కు చెందిన న్యాయవాది అన్బళగన్‌ కుమారుడు రోషన్‌(17) ప్లస్‌వన్‌ చదువుతున్నాడు. ఆదంబాక్కం బృందావన్‌నగర్‌లోని మైదానంలో స్నేహితులతో కలసి రోషన్‌ ఆడుకోవడానికి వెళ్లాడు. ఆట మధ్యలో హఠాత్తుగా రోషన్‌ కిందపడి పోవడంతో స్నేహితులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఆదంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోషన్‌కు గత ఏడాది గుండె శస్త్రచికిత్స చేసి ఫేస్‌మేకర్‌ అమర్చినట్లు విచారణలో తెలిసింది.

Read more