మైనర్ బాలికలపై వేధింపులు... ఇద్దరు మత బోధకులపై కేసు...

ABN , First Publish Date - 2020-10-14T21:09:33+05:30 IST

మైనర్ బాలికలతో అనుచితంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆన్‌లైన్ ఫిర్యాదుపై ఇద్దరు క్రైస్తవ మత ప్రబోధకులపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు.

మైనర్ బాలికలపై వేధింపులు... ఇద్దరు మత బోధకులపై కేసు...

చెన్నై : మైనర్ బాలికలతో అనుచితంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆన్‌లైన్ ఫిర్యాదుపై ఇద్దరు క్రైస్తవ మత ప్రబోధకులపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితులు శామ్ జైసుందర్, రూబెన్ క్లెమెంట్‌లపై ఐపీసీ సెక్షన్ 354(ఏ) ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 


విద్యార్థినులకు అనుచిత సందేశాలను పంపించినందుకు ఈ నిందితులను అంతర్జాతీయ క్రిస్టియన్ సంస్థ స్క్రిప్చర్ యూనియన్ ఈ నెల 6న ఫిర్యాదు చేసింది. 


స్క్రిప్చర్ యూనియన్ ప్రతినిథి ఒకరు మాట్లాడుతూ, తమ సంస్థకు చెందిన బోధకుడు శామ్ జైసుందర్‌పై దాదాపు రెండు నెలల క్రితం ఫిర్యాదు వచ్చిందని చెప్పారు. ఓ పందొమ్మిదేళ్ళ యువతి తల్లిదండ్రులు ఈ ఫిర్యాదు చేశారన్నారు. శామ్ జైసుందర్ తమ కుమార్తెతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని మౌఖికంగా ఫిర్యాదు చేశారని చెప్పారు. 


అంతకుముందు ఓ ట్విటరాటీ పోస్ట్ చేసిన స్క్రీన్‌షాట్స్ వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. తమ సంస్థలో పని చేసిన రూబెన్ క్లెమెంట్‌, జైసుందర్, దాదాపు 10 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయసుగల బాలికలు పరస్పరం సామాజిక మాధ్యమాల ద్వారా పంపించుకున్న చాట్ సంభాషణలకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను ఈ ట్విటరాటీ షేర్ చేశారని చెప్పారు. దీంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. నిందితులిద్దరినీ తమ సంస్థ నుంచి ఈ నెల 5న సస్పెండ్ చేసినట్లు తెలిపారు. 


జైసుందర్ 2006 నుంచి స్క్రిప్చర్ యూనియన్‌లో పని చేస్తున్నారు. ఆయన తమిళనాడులోని పాఠశాలలకు వెళ్లి, మైనర్ బాలలకు వెకేషన్ బైబిల్ స్కూల్, బైబిల్ స్టడీస్ శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు. జైసుందర్ ఓ వార్తా పత్రికతో మాట్లాడుతూ ఈ సందేశాల వెనుక దురుద్దేశం లేదని చెప్పారు. 


చెన్నై కమిషనర్ కార్యాలయం నుంచి ఈ ఫిర్యాదును అయనవరం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. స్క్రిప్చర్ యూనియన్ అయనవరం పోలీస్ స్టేషన్  పరిథిలో ఉండటంతో ఈ చర్య తీసుకున్నారు. 


Updated Date - 2020-10-14T21:09:33+05:30 IST