ఇకనుంచి లిఫ్టు ఎక్కితే కాలితో తొక్కాల్సిందే..

ABN , First Publish Date - 2020-05-31T01:18:16+05:30 IST

కరోనా కారణంగా దేనినైనా చేతితో తాకాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చెన్నై మెట్రో ఓ కొత్త విధానాన్ని...

ఇకనుంచి లిఫ్టు ఎక్కితే కాలితో తొక్కాల్సిందే..

చెన్నై: కరోనా కారణంగా దేనినైనా చేతితో తాకాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చెన్నై మెట్రో ఓ కొత్త విధానాన్ని వినియోగంలోకి తీసుకొచ్చింది. సాధారణంగా లిఫ్టు ఎక్కిన తరువాత ఏ ఫ్లోర్‌కు వెళ్లాలో ఆ నెంబరును చేతితో నొక్కుతాం. దీనికి అనుగుంగానే నెంబరు బోర్డు కూడా ఏర్పాటు చేసి ఉంటుంది. అయితే చెన్నైలోని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్(సీఎంఆర్ఎల్) మాత్రం లిఫ్టులను కొత్త తరహాలో ఏర్పాటు చేసింది. వీటిలో స్విచ్‌లన్నీ కాలి దగ్గర ఉంటాయి. ఏ ఫ్లోర్‌కు వెళ్లాలో ఆ ఫ్లోర్ నెంబరును కాలితో నొక్కాల్సి ఉంటుంది.


ఈ విధంగా కాలితో వినియోగించే లిఫ్టు తొలిసారిగా ఇక్కడే వినియోగంలోకి రావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ ఫీచర్ ఉన్న లిఫ్టులను ప్రస్తుతం కోయంబత్తూరులోని సీఎంఆర్ఎల్ ప్రధాన భవనంలోనే ఏర్పాటు చేశారు. దశలవారీగా ఇతర స్టేషన్లలోనూ ఈ లిఫ్టులను ఏర్పాటు చేయనున్నట్లు సీఎంఆర్ఎల్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

Updated Date - 2020-05-31T01:18:16+05:30 IST