తన సంస్థలో ముస్లిం ఉద్యోగులు లేరని ప్రచారం చేసిన బేకరీ యజమాని అరెస్ట్

ABN , First Publish Date - 2020-05-10T23:26:41+05:30 IST

చెన్నై: తన సంస్థలో ముస్లిం ఉద్యోగులు లేరని ప్రచారం చేసిన బేకరీ యజమానిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.

తన సంస్థలో ముస్లిం ఉద్యోగులు లేరని ప్రచారం చేసిన బేకరీ యజమాని అరెస్ట్

చెన్నై: తన సంస్థలో ముస్లిం ఉద్యోగులు లేరని ప్రచారం చేసిన బేకరీ యజమానిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. తన బేకరీ ఉత్పత్తులపై తన సంస్థలో ముస్లిం ఉద్యోగులు లేరని ముద్రించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. తన సంస్థలో ఉత్పత్తులన్నీ జైనులు తయారు చేసినవని వాట్సాప్‌లో ప్రచారం చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా బేకరీ యజమాని ప్రచారం చేస్తున్నారనే ఫిర్యాదుతో అతడిపై మంబాలం పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.      

Updated Date - 2020-05-10T23:26:41+05:30 IST