మా వద్ద ముస్లిం ఉద్యోగులు ఉండరు: చెన్నై బేకరీ వివాదాస్పద యాడ్

ABN , First Publish Date - 2020-05-10T20:58:23+05:30 IST

‘మా వద్ద ముస్లిం ఉద్యోగులు ఉండరు’ అంటూ చెన్నై చెందిన ఓ బేకరీ ఇచ్చిన యాడ్ స్థానికంగా విదాస్పద మవడంతో పోలీసులు సదరు బేకరీ యజమానిని అరెస్టు చేశారు.

మా వద్ద ముస్లిం ఉద్యోగులు ఉండరు: చెన్నై బేకరీ వివాదాస్పద యాడ్

చెన్నై: ‘మా వద్ద ముస్లిం ఉద్యోగులు ఉండరు’ అంటూ చెన్నైకి చెందిన ఓ బేకరీ ఇచ్చిన ప్రకటన స్థానికంగా విదాస్పద మవడంతో పోలీసులు సదరు బేకరీ యజమానిని అరెస్టు చేశారు. అతడిపై సెక్షన్ 295ఏ, 504 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నైలోని మమాలక్ష్మీ నగర్‌లో ఉన్న సదరు బేకరీ.. ఇటీవల ఇచ్చిన ఓ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఆ ప్రకటన ఇచ్చిన బేకరీ యాజమానిని అరెస్టు చేశారు. కాగా.. ఏ వర్గాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని నిందితుడు చెప్పినట్టు తెలుస్తోంది. ముస్లింలు తయారు చేసిన పదార్ధాలను ముట్టవద్దంటూ వాట్సాప్ గూపుల్లో ఓ సందేశం చెక్కర్లు కొడుతుందని, ఇటువంటి వాటి వల్ల తాను నష్ట పోకుండా ఉండేందుకు ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని ఈ ప్రకటన ఇచ్చినట్టు అతడు చెప్పుకొచ్చాడని సమాచారం.  

Updated Date - 2020-05-10T20:58:23+05:30 IST