దుబాయ్ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారం స్వాధీనం

ABN , First Publish Date - 2020-08-23T03:28:55+05:30 IST

దుబాయ్ ప్రయాణికుడికి చెందిన బంగారాన్ని చెన్నై ఎయిర్ కస్టమ్స్ స్వాధీనం చేసుకుంది. ఆ ప్రయాణికుడు అంతకుముందు

దుబాయ్ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారం స్వాధీనం

చెన్నై : దుబాయ్ ప్రయాణికుడికి చెందిన బంగారాన్ని చెన్నై ఎయిర్ కస్టమ్స్ స్వాధీనం చేసుకుంది. ఆ ప్రయాణికుడు అంతకుముందు విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ బ్యాగు తర్వాత వచ్చింది. 


చెన్నై ఎయిర్ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, దుబాయ్ నుంచి ఓ ప్రయాణికుడు ఈ విమానాశ్రయానికి వచ్చాడు. అతని బ్యాగు ఆ తర్వాత విమానాశ్రయానికి చేరుకుంది. 


ఆ బ్యాగును తనిఖీ చేసినపుడు, ఆట బొమ్మలను భద్రపరిచే పెట్టెలు, బెడ్‌స్ప్రెడ్స్‌లో రహస్యంగా ఉంచిన గోల్డ్ ఫాయిల్స్‌ను అధికారులు గుర్తించారు. వీటి బరువు 1.45 కేజీలు కాగా, వీటి విలువ రూ.78.40 లక్షలు ఉంటుంది. ఆ ప్రయాణికుడిని అరెస్టు చేశారు. 


Updated Date - 2020-08-23T03:28:55+05:30 IST