జరిమానాల రద్దు ఎఫెక్ట్
ABN , First Publish Date - 2020-04-05T12:59:52+05:30 IST
జరిమానాల రద్దు ఎఫెక్ట్

ఒకే వారంలో 8,500 కంటైనర్ల రాక
చెన్నై: ‘కరోనా’ కారణంగా విధించిన కర్ఫ్యూ అమలులో ఉన్న నేపథ్యంలో టోల్ ఫీజుతో పాటు వివిధ రకాల జరిమానాలను రద్దు చేయడంతో ఒకే వారంలో 8,500 కంటైనర్లు నగరానికి చేరుకున్నాయి. గత మార్చి 24వ తేది నుంచి 21 రోజుల లాక్ డైన్ అమలుకు వచ్చింది. అయితే సరుకుల రవాణాకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వడంతో 15కు పైగా నౌకల ద్వారా చెన్నైకి కంటైనర్లు వచ్చాయి. అయినప్పటికీ కంటైనర్ లారీలను నడిపేందుకు డ్రైవర్లు ముందుకు రావడం లేదు. ప్రత్యేక ఒప్పందం మేరకు కొందరు డ్రైవర్లను తాత్కాలికంగా నియమించుకున్న లారీల యజమానులు హార్బర్లకు లారీలను నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో, టోల్ ఫీజుతో పాటు పలురకాల జరిమానాల వసూలును ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో గత వారంలో మాత్రమే చెన్నై, ఎన్నూర్ కామరాజర్, కాట్టుపల్లి వంటి హార్బర్‌లలో 8,500 (20 అడుగుల పొడవు) కంటైనర్లు దిగుమతి అయ్యాయి. ఈ కంటైనర్లను లారీల ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలించారు.