కీమోథెరపీతో కరోనా తీవ్రత పెరగదు: శాస్త్రవేత్తలు
ABN , First Publish Date - 2020-06-25T07:35:53+05:30 IST
కేన్సర్, కీమోథెరపీ చికిత్సపొందే వారిలో కరోనా తీవ్రమయ్యే అవకాశాలు లేవని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా బారినపడిన 423 మంది కేన్సర్ రోగులపై అధ్యయనం అనంతరం ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపారు...

న్యూయార్క్, జూన్ 24 : కేన్సర్, కీమోథెరపీ చికిత్సపొందే వారిలో కరోనా తీవ్రమయ్యే అవకాశాలు లేవని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా బారినపడిన 423 మంది కేన్సర్ రోగులపై అధ్యయనం అనంతరం ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపారు. ఈ రోగుల్లో 20 శాతం మందికి శ్వాసకోశ సమస్యలు తలెత్తగా, 12 శాతం మంది మృతిచెందారన్నారు. ఇమ్యునోథెరపీతో మిగతా వారిలో ఇన్ఫెక్షన్‌కు అడ్డుకట్ట పడిందన్నారు.