ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కూలీల కోసం ఛత్తీస్‌గఢ్ ప్యాకేజీ

ABN , First Publish Date - 2020-04-16T03:43:41+05:30 IST

దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తమ రాష్ట్ర కూలీల కోసం

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కూలీల కోసం ఛత్తీస్‌గఢ్ ప్యాకేజీ

రాయ్‌పూర్ : దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తమ రాష్ట్ర కూలీల కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దాదాపు 64,416 మంది కూలీలకు ఈ ప్యాకేజీ వర్తిస్తుందని తెలిపింది. వీరికి ఈ సొమ్ముతో ఆహారం, వసతి, వైద్య సదుపాయాలు అందిస్తామని తెలిపింది. 6,556 మంది కార్మికుల బ్యాంకు ఖాతాలకు రూ.19 లక్షలు జమ చేసినట్లు తెలిపింది. 


తమ రాష్ట్రానికి చెందిన కూలీలు 4 కేంద్ర పాలిత ప్రాంతాలు, 20 రాష్ట్రాల్లో చిక్కుకున్నట్లు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. 

Updated Date - 2020-04-16T03:43:41+05:30 IST