ఛత్రపతి శివాజీ టెర్మినస్ మ్యూజియం మూత

ABN , First Publish Date - 2020-03-13T20:18:58+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రఖ్యాత ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్నినస్‌లోని హెరిటేజ్ మ్యూజియంను ఈ నెల 31వ తేదీ వరకూ ..

ఛత్రపతి శివాజీ టెర్మినస్ మ్యూజియం మూత

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రఖ్యాత ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్నినస్‌లోని హెరిటేజ్ మ్యూజియంను ఈ నెల 31వ తేదీ వరకూ మూసేస్తున్నారు. సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. దేశంలో కరోనా కేసులు 75కు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్-19 తొలి మరణం కర్ణాటకలో సంభవించినట్టు ఆరోగ్య శాఖ ఇంతకముందు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 1,30,000 మంది కోవిడ్-19తో చికిత్స పొందుతుండగా, ఇంతవరకూ 4,700 మంది మృతి చెందారు.

Updated Date - 2020-03-13T20:18:58+05:30 IST