ఎమ్మెల్యే హత్య కేసులో ముకుల్ రాయ్‌పై చార్జిషీటు
ABN , First Publish Date - 2020-12-06T07:35:13+05:30 IST
తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యజిత్ విశ్వాస్ హత్య కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు ముకుల్ రాయ్‌పై పశ్చిమ బెంగాల్ సీఐడీ శనివారం అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది.

కోల్‌కతా, డిసెంబరు 5: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యజిత్ విశ్వాస్ హత్య కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు ముకుల్ రాయ్‌పై పశ్చిమ బెంగాల్ సీఐడీ శనివారం అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఘటనలో ముకుల్ రాయ్ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపించింది. గతంలోనే ఆయనను సీఐడీ ప్రశ్నించింది. అయితే, తొలి చార్జిషీట్‌లో పేరును చేర్చలేదు.