10 మంది తబ్లీగీలపై చార్జిషీట్‌

ABN , First Publish Date - 2020-06-23T07:51:31+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లఘించి ముజఫర్‌నగర్‌లో సమావేశమైన కేరళ, కర్ణాటకకు చెందిన 10 మంది తబ్లీగీ జమాత్‌ సభ్యులపై కోర్టులో చార్జిషీట్‌ నమోదు చేశారు...

10 మంది తబ్లీగీలపై చార్జిషీట్‌

ముజఫర్‌నగర్‌, జూన్‌ 22: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లఘించి ముజఫర్‌నగర్‌లో సమావేశమైన కేరళ, కర్ణాటకకు చెందిన 10 మంది తబ్లీగీ  జమాత్‌ సభ్యులపై కోర్టులో చార్జిషీట్‌ నమోదు చేశారు. వీరిపై న్యూ మండి పోలీస్‌ స్టేషన్‌లో ఐపీసీ, ఎపిడమిక్‌ డిసీసెస్‌ చట్టం కింద ఏప్రిల్‌లో కేసు నమోదైంది. మార్చిలో నిర్వహించిన తబ్లీగీ సమావేశంలో పాల్గొన్న వారు దేశంలోని కరోనా వ్యాప్తికి కారణమయ్యారని ఆరోపణలున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన నేపాల్‌కు చెందిన 12 మంది తబ్లీగీలపై మరో చార్జిషీట్‌ నమోదైంది. ఇప్పటికే జమాత్‌ సభ్యులు బెయిల్‌పై విడుదలయ్యారు. 

Updated Date - 2020-06-23T07:51:31+05:30 IST