ఢిల్లీ రైతుల ఉద్యమానికి చంద్రబాబు మద్దతు..

ABN , First Publish Date - 2020-12-06T18:00:10+05:30 IST

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు చేస్తున్న ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుంది.

ఢిల్లీ రైతుల ఉద్యమానికి చంద్రబాబు మద్దతు..

అమరావతి: మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు చేస్తున్న ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. రైతుల సహేతుకమైన డిమాండ్లకు పలు పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఇవాళ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మద్దతు తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేవరకు పోరాటం కొనసాగించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్‌కు ఇద్దరు నేతలు మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈ బంద్‌లో క్రియాశీలంగా పాల్గొంటారని కేసీఆర్ ప్రకటించడం విశేషం.

Read more