ఈ నెలలో రాష్ట్రానికి 2.10 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-09-03T08:09:24+05:30 IST

ఈ నెలలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 2.10 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను సరఫరా చేస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు...

ఈ నెలలో రాష్ట్రానికి 2.10 లక్షల  మెట్రిక్‌ టన్నుల యూరియా: కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఈ నెలలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 2.10 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను సరఫరా చేస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు. ఈ నెలకు రాష్ట్రానికి 2 లక్షల మెట్రిక్‌ టన్నులను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని, కానీ దానికి అదనంగా మరో 10 వేల మెట్రిక్‌ టన్నులను పంపించాలని కేంద్రం నిర్ణయించిందని ఆయన చెప్పారు.


బుధవారం ఢిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణకు యూరియా సరఫరాపై చర్చించారు. అనంతరం మీడియాతో కిషన్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు పూర్తి స్థాయిలో యూరియాను అందించాలని విజ్ఞప్తి చేశానని తెలిపారు. ఇతర దేశాల నుంచి యూరియా దిగుమతి అవుతోందని, వాతావరణం సరిగ్గా లేకపోవడంతో పాటు వర్షాలు, కరోనా వంటి కారణాలతో యూరియా ఆలస్యంగా దిగుమతి అయ్యిందని వివరించారు.


Updated Date - 2020-09-03T08:09:24+05:30 IST