డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ కాలపరిమితిని పెంచిన కేంద్రం

ABN , First Publish Date - 2020-12-28T03:20:49+05:30 IST

డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ కాలపరిమితిని పెంచిన కేంద్రం

డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ కాలపరిమితిని పెంచిన కేంద్రం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాల కాలపరిమితి తేదీని పొడిగించినట్లు కేంద్ర సర్కారు పేర్కొంది. డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, పర్మిట్ల పత్రాలను మార్చి 31, 2021 వరకు ఉపయోగించవచ్చని కేంద్ర మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఫిబ్రవరి 1 2020తో  కాలపరిమితి అయిపోయిన డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు 2021 మార్చి 31 వరకు చెల్లుబాటు అవుతాయని కేంద్రం పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

Updated Date - 2020-12-28T03:20:49+05:30 IST