ఎంఎస్ఎంఈలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు

ABN , First Publish Date - 2020-05-13T23:49:58+05:30 IST

కరోనా కారణంగా సంక్షోభంలో చిక్కుకున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం ఊరట కల్పించింది. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.3 లక్షల కోట్లు ..

ఎంఎస్ఎంఈలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు

న్యూఢిల్లీ: కరోనా కారణంగా సంక్షోభంలో చిక్కుకున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం ఊరట కల్పించింది. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.3 లక్షల కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకిటించారు. ఇందువల్ల 45 లక్షల చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు లబ్ధి చూకురుతుందని ఆమె తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవనం పోసేందుకు ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ వివరాలను బుధవారంనాడు మంత్రి వెల్లడించారు. 


'సూక్ష్మ, మధ్య, లఘ, కుటీర పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) రూ.3 లక్షల కోట్లు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇస్తాం. నాలుగేళ్ల కాలవ్యవధి, 12 నెలల మారటోరియంతో రుణాలు మంజురు చేస్తాం. అలాగే, తీవ్ర ఒత్తిళ్లలో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.20,000 కోట్ల సబార్డినేట్ రుణాలు ఇస్తాం. ఆ తరహా 2 లక్షల వ్యాపారాలకు ఇందువల్ల లబ్ధి చేకూరుతుంది. ఎంఎస్ఎంఈ ఫండ్ క్రియేట్ చేస్తాం' అని నిర్మలా సీతారామన్ తెలిపారు.


ఎంఎస్ఎంఈల నిర్వచనం కూడా మారనుందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం రూ.25 లక్షల పెట్టుబడి ఉన్న సంస్థలను మైక్రో యూనిట్లుగా పిలుస్తున్నారని, ఇక ముందు రూ.1 కోటి వరకూ పెట్టుబడి పెట్టే యూనిట్లను మైక్రో యూనిట్లవుతాయని, అలాగే రూ.5కోట్ల వరకూ టర్నోవర్ ఉన్న యూనిట్లు కూడా మైక్రో యూనిట్ల కిందకు వస్తాయని ఆమె తెలిపారు. టర్నోవర్ ఆధారంగా చిన్న వ్యాపారాలను నిర్వచించే విధానం ప్రవేశపెడతామని చెప్పారు. రూ.200 కోట్ల వరకూ గవర్నమెంట్ ప్రొక్యూర్‌మెంట్ కోసం గ్లోబల్ టెంబర్లు నిషేధించనున్నట్టు తెలిపారు. ఈ చర్య ఎంఎస్ఎంలు గవర్నమెంట్ టెండర్లను పూర్తి చేసి, సరఫరా చేసేందుకు ఉపకరిస్తుందని చెప్పారు.

Updated Date - 2020-05-13T23:49:58+05:30 IST