థానేలో కేంద్ర బృందం పర్యటన.. ఆ కేసుల గురించి గుచ్చిగుచ్చి..
ABN , First Publish Date - 2020-04-26T02:50:13+05:30 IST
కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ..

ముంబై: కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ బృందం ఇవాళ మహారాష్ట్రలోని థానే జిల్లాలో పర్యటించింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శ మనోజ్ జోషి సారధ్యంలోని ఓ బృందం ఇవాళ జిల్లా అధికార యంత్రాంగంతో సమావేశమైంది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులను సందర్శించింది. ‘‘కౌశల్య ఆస్పత్రి, థానే ప్రభుత్వ ఆస్పత్రి సహా మరికొన్ని ఆస్పత్రులను కేంద్ర బృందం సందర్శించింది. కరోనా హాట్‌స్పాట్లుగా గుర్తించిన పర్సిక్ నగర్, అమృత్ నగర్ తదితర ప్రాంతాలను కూడా కేంద్ర అధికారులు పరిశీలించారు. ఫీవర్ క్లినిక్‌లలో చికిత్స పొందుతున్న అనుమానాస్పద కేసులపై వారు గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. మరిన్ని క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు..’’ అని ఓ అధికారి వెల్లడించారు.