రైతులతో చర్చలు సానుకూలంగా జరిగాయి: కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2020-12-31T01:32:12+05:30 IST

నేడు రైతులతో జరిపిన చర్చలు సానుకూల వాతావరణంలో ఫలవంతంగా జరిగాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.

రైతులతో చర్చలు సానుకూలంగా జరిగాయి: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: నేడు రైతులతో జరిపిన చర్చలు సానుకూల వాతావరణంలో ఫలవంతంగా జరిగాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. బుధవారం నాడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన రైతు సంఘాలతో చర్చలు జరిగాయి. ఈ భేటీ అనంతరం తోమర్ మీడియాతో మాట్లాడారు. ఈ చర్చల్లో రైతులు డిమాండ్ చేస్తున్న 4 అంశాల్లో రెండింటిపై స్పష్టత లభించిందని చెప్పారు. విద్యుత్ చట్టంలో సంస్కరణలు తేవడం ద్వారా తమక నష్టం జరుగుతుందని వారు భావిస్తున్నారని అన్నారు. అలాగే నీటిపారుదల కోసం రాష్ట్రాలు రైతులకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీని కొనసాగించాలని రైతు సంఘాలు కోరినట్లు ఆయన చెప్పారు. ఈ అంశంపై కూడా ఏకాభిప్రాయం కుదిరిందని తోమర్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-12-31T01:32:12+05:30 IST