అమెరికా వంటి దేశాలే కారణం.. పర్యావరణ కాలుష్యంపై కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2020-12-11T18:16:57+05:30 IST

పర్యావరణ కాలుష్యానికి భారత్ ఎంత మాత్రమూ కారణం కాదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జవడేకర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం పెరగడానికి అమెరికా వంటి పాశ్చాత్య దేశాలే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ కాలుష్యంలో...

అమెరికా వంటి దేశాలే కారణం.. పర్యావరణ కాలుష్యంపై కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: పర్యావరణ కాలుష్యానికి భారత్ ఎంత మాత్రమూ కారణం కాదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జవడేకర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం పెరగడానికి అమెరికా వంటి పాశ్చాత్య దేశాలే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ కాలుష్యంలో అమెరికా వాటా అత్యధికంగా 25 శాతమని, ఇక 22 శాతంతో యూరప్ రెండో స్థానంలో ఉండగా.. 3వ స్థానంలో 13 శాతంతో చైనా ఉందని చెప్పారు. కానీ భారత దేశం నుంచి కేవలం 3 శాతం మాత్రమే కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయని, అలాంటప్పుడు పర్యావరణ కాలుష్యానికి భారత్ ఏ విధంగా కారణమవుతుందో తెలియజేయాలని అన్నారు.


పర్యావరణ కాలుష్యం అనేది ఏదో ఒకరోజు జరిగిందని కాదని, దాదాపు గత 100ఏళ్లుగా భూమిపై కాలుష్యం గణనీయంగా పెరుగుతోందని జవడేకర్ అన్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ ఆలోచన చేయాలని, ఒక్కతాటిపైకి వచ్చి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు.Updated Date - 2020-12-11T18:16:57+05:30 IST