కరోనా కోసం కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2020-03-30T17:20:42+05:30 IST

కరోనా వైరస్‌పై పోరాటం కోసం కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు రూపొందించింది.

కరోనా కోసం కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాటం కోసం కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. బహిరంగ ప్రదేశాలకన్నా... నివాస ప్రాంతాల్లోనే కరోనా ముప్పు ఎక్కువ ఉందంది. మరీ ముఖ్యంగా కరోనా పాజిటివ్‌ కేసులున్న ప్రాంతాల్లో...లిఫ్టులు, ఎలివేటర్లలాంటివి వాడకపోవడమే మంచిదని పేరొంది. గేటు హ్యాండిల్స్‌, లిఫ్ట్‌ బటన్స్‌, ఎప్పటికప్పుడు... సోడియం హైపో క్లోరైడ్‌ లాంటి రసాయనాలతో శుభ్రం చేయాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో గాలి వెలుతురు ధారాళంగా ఉంటాయి కాబట్టి...కరోనా ముప్పు కాస్త తక్కువ ఉంటుందని, నివాస ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయమిదని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

Updated Date - 2020-03-30T17:20:42+05:30 IST