కేంద్రప్రభుత్వ కార్యాలయాల్లో క్యాంటీన్ల మూసివేత
ABN , First Publish Date - 2020-04-21T12:30:31+05:30 IST
కేంద్రప్రభుత్వ మంత్రిత్వశాఖలు, అని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న క్యాంటీన్లను మూసివేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వ మంత్రిత్వశాఖలు, అని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న క్యాంటీన్లను మూసివేస్తూ కేంద్రప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రబలకుండా కట్టడి చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని అన్ని కార్యాలయాలు, అన్ని మంత్రిత్వశాఖ విభాగాల్లో ఉన్న క్యాంటీన్లను వెంటనే మూసివేయాలని మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ పెన్షన్స్ విభాగం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రప్రభుత్వ ఆధీనంలోని పలు ప్రభుత్వ శాఖల్లో అధికారులు పనిచేస్తున్నా, క్యాంటీన్లు మాత్రం మూసి ఉంచాలని కేంద్రం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించే దాకా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని క్యాంటీన్లను మూసి ఉంచాలని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో కోరింది.