దేవాలయాలు, మసీదులు, చర్చీల్లోకి వెళ్లాలంటే ఇలా చేయాల్సిందే..

ABN , First Publish Date - 2020-06-05T03:00:31+05:30 IST

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 5.0 లాక్ డౌన్‌ను దేశవ్యాప్తంగా విధించిన విషయం తెలిసిందే...

దేవాలయాలు, మసీదులు, చర్చీల్లోకి వెళ్లాలంటే ఇలా చేయాల్సిందే..

న్యూ ఢిల్లీ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 5.0 లాక్ డౌన్‌ను జూన్-30 వరకు దేశవ్యాప్తంగా విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొన్ని సడలింపులు ఇచ్చిన కేంద్రం.. తాజాగా.. మరికొన్నింటికి అనుమతులిస్తూ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటన రూపంలో విడుదల చేసింది. జూన్-08 నుంచి కార్యాలయాలు, మతపరమైన ప్రదేశాలు, మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రామాణిక నిబంధనలను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది.హోటల్స్, మాల్స్, రెస్టారెంట్స్ మార్గదర్శకాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడగలరు.


దేవాలయాలు, మసీదులు, చర్చీల్లోకి వెళ్లాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే..

- దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో వేటినీ చేతితో తాకరాదు

- దేవాలయాల్లో తీర్థ, ప్రసాదాలు పంచరాదు

- భక్తులపై పవిత్ర జలాలను చల్లరాదు

- నోటికి మాస్క్ ఉన్నవారికి మాత్రమే లోపలికి అనుమతించాలి

- గర్భిణీలు, వృద్ధులను అనుమతించకూడదు

- థర్మల్ స్క్రీనింగ్ చేశాకే దేవాలయాల్లోకి అనుమతించాలి

- వీలైనంత వరకూ సామూహిక ప్రార్థనలు చేయకూడదు

- సామూహిక గీతాలు, భజనలు పాడవద్దు

- రికార్డింగ్ ద్వారా మాత్రమే భజనలు పెట్టాలి

-  వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా వెంటిలేషన్ ఏర్పాటు చేయాలి.


వీటితో పలు మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. వాటిని ఈ కింద ఉన్న ప్రకటనలో చూడగలరు.Updated Date - 2020-06-05T03:00:31+05:30 IST