సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2020-04-02T01:15:35+05:30 IST
కరోనా వైరస్ నేపథ్యంలో సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం వెలువరించింది

న్యూఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం వెలువరించింది. విద్యార్థుల అకాడమిక్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేవలం 29 ముఖ్యమైన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఆదేశించారు. హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ఫర్మెషన్ సిస్టమ్స్‌లో జరగబోయే అడ్మిషన్లలో విద్యార్థుల ఉత్తీర్ణత అత్యవసరం కాబట్టి ముఖ్యమైన 29 సబ్జెక్టులకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. మిగితా సబ్జెక్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహించరాదని కేంద్రమంత్రి పోఖ్రియాల్ తేల్చి చెప్పారు.