మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు

ABN , First Publish Date - 2020-04-24T22:43:04+05:30 IST

కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అనవసర ఖర్చుతో కూడిన బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టును ఆపివేయాలని మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచనలు చేసింది.

మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అనవసర ఖర్చుతో కూడిన బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టును ఆపివేయాలని మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచనలు చేసింది. దేశంలో కరోనా వైరస్ సంక్షోభం ఉందని, ముందు కరోనా కట్టడిపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా సూచించారు.

దేశంలో కరోనా వైరస్ సంక్షోభం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో అనవసరమైన ప్రాజెక్టులను చేపడుతోందని కాంగ్రెస్ విమర్శించింది. రూ. 23,000 కోట్ల రూపాయలతో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్, రూ. 1,10,000 కోట్ల రూపాయలతో బుల్లెట్ రైలు ప్రాజెక్టు చేపట్టడం సరికాదని కాంగ్రెస్ విమర్శించింది.

Updated Date - 2020-04-24T22:43:04+05:30 IST