కేంద్రం కీలక నిర్ణయం.. లాక్‌డౌన్‌ను పాటించని వారిపై...

ABN , First Publish Date - 2020-03-23T17:03:51+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ ఆదేశాలను ఆయా రాష్ట్రాల్లో ప్రజలు పెద్దగా...

కేంద్రం కీలక నిర్ణయం.. లాక్‌డౌన్‌ను పాటించని వారిపై...

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ ఆదేశాలను ఆయా రాష్ట్రాల్లో ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక సూచన చేసింది. లాక్‌డౌన్‌ను రాష్ట్రాలు విధిగా అమలుపరచాలని, అతిక్రమించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది.


ఇదిలా ఉంటే.. ఉదయం నుంచి ప్రజలు రోడ్లపై గుమిగూడి కనిపిస్తున్నారు. దుకాణాలు కూడా చాలావరకూ తెరిచే ఉన్నాయి. దీంతో.. లాక్‌డౌన్ ప్రభావం దేశంలో పాక్షికంగానే కనిపిస్తోంది. దేశ ప్రజలు ఆశించిన స్థాయిలో లాక్‌డౌన్ పాటించకపోవడంపై ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ను చాలా మంది సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించడం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవాలని మిమ్మల్ని కోరుతున్నానని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.



Updated Date - 2020-03-23T17:03:51+05:30 IST