ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి ఆటంకం కలగనీయద్దు: రాష్ట్రాలకు కేంద్రం లేఖ

ABN , First Publish Date - 2020-03-25T03:30:01+05:30 IST

విధి నిర్వహణలో ఉన్న ప్రింట్, ఎలక్డ్రానిక్ జర్నలిస్టులు, ఇతర సిబ్బందికి ఎటువంటి ఆటంకాలూ రాకుండా చూడాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి ఆటంకం కలగనీయద్దు: రాష్ట్రాలకు కేంద్రం లేఖ

న్యూఢిల్లీ: లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు.. ఈ రాత్రి నుంచి భారత్ పూర్తి లాక్ డౌన్‌లోకి వెళుతుందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో ఉన్న ప్రింట్, ఎలక్డ్రానిక్ జర్నలిస్టులు, ఇతర సిబ్బందికి ఎటువంటి ఆటంకాలూ రాకుండా చూడాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలకు ఓ లేఖ రాసింది. ఆ లేఖలో సవివరమైన సూచనలను పొందుపరిచింది.


లేఖ సారాంశం సంక్షిప్తంగా..

కరోనా కట్టడిలో సమాచార మార్పిడి ముఖ్య పాత్ర పోషిస్తుంది. కచ్చితమైన, నమ్మకమైన సమాచారం అందించడంలో న్యూస్ పేపర్లు,  టీవీ ఛానళ్లు, న్యూస్ ఎజెన్సీలు, కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్సోలు, ఎఫ్ ఎమ్, కమ్మూనిటీ రెడియోలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ సమచార మార్పిడిలో కొన్ని వ్యవస్తలు అత్యావస్యకమైనవి. అవి..

1. న్యూస్ పేపర్లు, మ్యాగజైన్ల ముద్రణకు అవసరమైన ప్రింటింగ్ ప్రెస్సులు, వాటి అనుబంధ వ్యవస్థలు.

2. అన్ని టీవీ ఛానల్స్, వాటి అనుబంధ టెలిపోర్టులు, డీఎస్‌ఎన్‌జీలు.

3.డీటీహెచ్/హ్ఐటీఎస్ కార్యకలాపాలు, వాటికి సంబంధించిన ఇతర వ్యవస్థలు.

4. ఎఫ్/సీఆర్ఎస్ నెట్‌వర్క్‌లు

5.ఎమ్మెస్సోలు, కేబుల్ ఆపరేటర్లు

6. వార్తా సంస్థలు(న్యూస్ ఎజెంస్సీలు)


కరోనా కట్టడికి రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్న నేపథ్యంలో పైన పేర్కొన్న వ్యవస్థలు, వాటిలోని సిబ్బందికి ఎటువంటి ఆటంకాలు రాకుండా తగు చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలను కోరడమైంది. వాటిలోని సిబ్బందికి విధి నిర్వహణలో ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మీడియాకు చెందిన వాహనాలు, సిబ్బంది రాకపోకలకు ఎటువంటి అంతరాయం రాకుండా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. 


Updated Date - 2020-03-25T03:30:01+05:30 IST