రాజీవ్, ఇందిరా ట్రస్టులపై దర్యాప్తుకు కేంద్రం ఆదేశం
ABN , First Publish Date - 2020-07-08T18:08:47+05:30 IST
రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రాస్ట్, ఇందిరా గాంధీ మెమొరియల్ ట్రస్ట్‌పై కేంద్రం దర్యాప్తుకు ఆదేశించింది.
న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రాస్ట్, ఇందిరా గాంధీ మెమొరియల్ ట్రస్ట్‌పై కేంద్రం దర్యాప్తుకు ఆదేశించింది. నిధుల దారి మళ్లింపు అలాగే పన్ను ఎగవేతలకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో కేంద్రం దర్యాప్తుకు ఆదేశించింది. ఈడీ స్పెషల్ డైరెక్టర్ ఈ దర్యాప్తును పరిశీలించనున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి విరాళాలు తీసుకున్నారంటూ వచ్చిన ఆరోపణలపై కేంద్రం సీరియస్‌గా ఉంది. కేంద్ర హోంశాఖ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన అంశాలపై దర్యాప్తు చేయాల్సిందిగా పూర్తి అధికారాలను ఇచ్చింది. ఈడీ స్పెషల్ డైరక్టర్ ఈ కమిటీకి నేతృత్వం వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.