కార్లలో ముందు సీట్లకు ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి

ABN , First Publish Date - 2020-12-30T08:38:35+05:30 IST

ముందు సీటులో డ్రైవర్‌ పక్కన ప్రయాణించే వారికీ ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి కానుంది. ప్రయాణికులకు మరింత భద్రత కల్పించాలనే

కార్లలో ముందు సీట్లకు ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి

కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్‌

తప్పని సరి చేసిన కేంద్రం


న్యూఢిల్లీ, డిసెంబరు 29 : ముందు సీటులో డ్రైవర్‌ పక్కన ప్రయాణించే వారికీ ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి కానుంది. ప్రయాణికులకు మరింత భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ తాజా ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. దీనికి సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్‌ను కేంద్ర రవాణా శాఖ విడుదల చేసింది. ఎం1 కేటగిరీ వాహనాల్లో డ్రైవర్‌ సీటులో ఎయిర్‌బ్యాగ్‌ను కేంద్రం జూలై 1, 2019 నుంచి తప్పనిసరి చేసింది. అయితే డ్రైవర్‌ సీటు పక్కన కూర్చొనే ప్రయాణికులకూ ప్రమాదం పొంచి ఉంటుంది. దీంతో వారికీ ఎయిర్‌బ్యాగ్‌ నిబంధన తప్పనిసరి కానుంది. కొత్త మోడల్‌ కార్లకు ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధన అమలు కానుంది. ప్రస్తుతం ఉన్న మోడళ్లకు గడువును జూన్‌ 1, 2021గా నిర్ణయించారు. తాజా ప్రతిపాదనపై అభ్యంతరాలు, సూచనలను 30 రోజుల్లోగా తెలపాలని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో కోరింది. 

Updated Date - 2020-12-30T08:38:35+05:30 IST