కరోనా వ్యాక్సిన్ పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ!

ABN , First Publish Date - 2020-11-26T16:10:52+05:30 IST

ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపధ్యంలో...

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ!

న్యూఢిల్లీ: ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపధ్యంలో కొన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చేదీ వెల్లడిస్తున్నాయి.  ఇదే కోవలో భారత్ కూడా కరోనా వ్యాక్సిన్ రాగానే, దాని పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించింది. అలాగే వ్యాక్సిన్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై కసరత్తు చేస్తోంది. 


దేశ ప్రజలకు సురక్షిత టీకా అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు లేఖలు రాసింది. దానిలో వచ్చే ఏడాది కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధప్రాతిపతికన జరుగుతుందని పేర్కొంది. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన దిశానిర్దేశాలను కూడా తెలియజేసింది. టీకా సురక్షితమైనదని ప్రజలకు తెలియజేయాలని పేర్కొంది. అలాగే వ్యాక్సిన్ పంపిణీలో అక్రమాలు చోటుచేసుకోకుండా చూడాలని ఉన్నతాధికారులను కోరింది. 


Updated Date - 2020-11-26T16:10:52+05:30 IST