ఆడతనాన్ని ఆనందించండి : ప్రియాంక గాంధీ

ABN , First Publish Date - 2020-03-08T22:59:03+05:30 IST

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ధైర్యంగా ఉండాలని,...

ఆడతనాన్ని ఆనందించండి : ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ధైర్యంగా ఉండాలని, ఆడతనాన్ని ఆనందించాలని ఆదివారం ఆమె ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. 


‘‘మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా సోదరీమణులందరికీ : మిమ్మల్ని మీరు నిర్వచించుకోండి, మీ ఆడతనాన్ని ఆనందించండి, ధైర్యంగా ఉండండి’’ అని ప్రియాంక పేర్కొన్నారు. 


ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో మహిళల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు.


Updated Date - 2020-03-08T22:59:03+05:30 IST