కోవిడ్-19 కష్టాలు : అమెరికాలో చిక్కుకున్న సీఈసీ సునీల్ అరోరా

ABN , First Publish Date - 2020-04-21T23:13:28+05:30 IST

భారత దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా ప్రయాణ

కోవిడ్-19 కష్టాలు : అమెరికాలో చిక్కుకున్న సీఈసీ సునీల్ అరోరా

న్యూఢిల్లీ : భారత దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా ప్రయాణ సదుపాయాలు లేకపోవడంతో అమెరికాలో చిక్కుకుపోయారు. ఆయన వ్యక్తిగత పని మీద అమెరికా వెళ్ళారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆయన ఈ నెల 4న తిరిగి స్వదేశానికి రావలసి ఉంది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించడం కోసం అమలు చేస్తున్న ఆంక్షల్లో భాగంగా భారత దేశం-అమెరికా మధ్య అంతర్జాతీయ విమానాల రాకపోకలను మార్చి మూడో వారం నుంచి నిలిపేసిన సంగతి తెలిసిందే.


ఎన్నికల సంఘం అధికార ప్రతినిథి మాట్లాడుతూ సీఈసీ సునీల్ అరోరా వ్యక్తిగత పని మీద మార్చి 10న అమెరికా వెళ్ళారని, ఆయన ఈ నెల 4న తిరిగి రావలసి ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆయన అమెరికా నుంచి ఎన్నికల కమిషన్‌తో సంబంధాలు నెరపుతున్నట్లు వివరించారు. 


భారత ఎన్నికల సంఘంలో సీఈసీ సునీల్ అరోరా, ఇద్దరు కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర ఉన్నారు.


భారత ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం మే 3 వరకు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమాన యాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. 


ఇదిలావుండగా, కోవిడ్-19పై యుద్ధంలో ఎన్నికల కమిషన్ కూడా భాగస్వామి అయింది. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు సీఈసీతోపాటు ఇద్దరు కమిషనర్లు తమ మూల వేతనాల్లో 30 శాతం కోత విధించుకున్నారు. ఒక సంవత్సరం పాటు ఈ కోత అమలవుతుంది.


Updated Date - 2020-04-21T23:13:28+05:30 IST