రక్షణ రంగ సంస్కరణలు.. కేంద్రంపై సీడీఎస్ ప్రసంశల జల్లు

ABN , First Publish Date - 2020-05-17T20:08:29+05:30 IST

దేశీయ రక్షణ తయారీ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం చేపట్టిన సంస్కరణల పట్ల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ హర్షం వ్యక్తం చేశారు.

రక్షణ రంగ సంస్కరణలు.. కేంద్రంపై సీడీఎస్ ప్రసంశల జల్లు

న్యూఢిల్లీ:  దేశీయ రక్షణ తయారీ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం చేపట్టిన సంస్కరణల పట్ల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని అంశాలను సమన్వయ పరుచుకుంటూ కేంద్రం దేశియ రక్షణ రంగాన్ని ప్రోత్సహించేందుకు అన్ని చర్యలూ తీసుకుందని ఆయన ప్రసంశల వర్షం కురిపించారు. శనివారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. అదే విధంగా దేశీయంగా ఆర్మీ రక్షణ అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక బడ్జెట్‌ రూపొందిస్తామని కూడా మాటిచ్చారు. ఈ చర్యల పట్ల హర్షం వ్యక్తం చేసిన బిపిన్ రావత్.. ఇవి రక్షణ రంగంలో పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు.  ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు కారణంగా కొత్త సాంకేతికత భారత్‌కు అందుతుందని తెలిపారు. 

Updated Date - 2020-05-17T20:08:29+05:30 IST