జూలై 1 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు

ABN , First Publish Date - 2020-05-09T08:24:03+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన సీబీఎ్‌సఈ 10, 12 తరగతుల పరీక్షలను జూలై 1-15 తేదీల మధ్య నిర్వహించాలని

జూలై 1 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు

  • త్వరలో షెడ్యూలు : కేంద్రం

న్యూఢిల్లీ, మే 8: లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన సీబీఎ్‌సఈ 10, 12 తరగతుల పరీక్షలను జూలై 1-15 తేదీల మధ్య నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ పరీక్షల షెడ్యూలు, నిర్వహణ విధానాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. నీట్‌ (జూలై 26), జేఈఈ మెయిన్స్‌ (జూలై 18-23) పరీక్షల కన్నా ముందుగానే సీబీఎ్‌సఈ పరీక్షలను పూర్తిచేసేయాలని బోర్డు భావిస్తోంది. వాయిదా పడ్డ వాటిలో తదుపరి కోర్సుల్లో ప్రవేశానికి అవసరమైన 29 సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎ్‌సఈ తెలిపింది. 

Updated Date - 2020-05-09T08:24:03+05:30 IST